Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
అమ్మ లేని ఇల్లు.. పారిశుధ్య కార్మికులు లేని వీధి ఒక్కటే:ఎమ్మెల్యే గల్లా మాధవి

అమ్మ లేని ఇల్లు.. పారిశుధ్య కార్మికులు లేని వీధి ఒక్కటే:ఎమ్మెల్యే గల్లా మాధవి

Panthagani Anusha
10 మే, 2026

అమ్మ లేని ఇల్లు ఎలా ఉంటుందో పారిశుధ్య కార్మికులు లేని వీధి కూడా అంతే అస్తవ్యస్తంగా ఉంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం గుంటూరులోని పోలీస్ కళ్యాణ మండపంలో మహిళా పారిశుధ్య కార్మికుల కోసం ఆమె ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆరోగ్య సంరక్షణే ధ్యేయం - మెగా మెడికల్ క్యాంప్

నిత్యం మురికిలో ఉంటూ ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తూ వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న మహిళా కార్మికుల కోసం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వికాస్ హాస్పిటల్, శ్రీ భ్రమర ట్రస్ట్ సహకారంతో భారీ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 720 మంది మహిళలకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య పరీక్షల అనంతరం మహిళా కార్మికురాలికి గా చీరలను బహుమతిగా అందజేశారు. అదేవిధంగా వివిధ డివిజన్లలో అంకితభావంతో పనిచేస్తున్న ఉత్తమ పారిశుధ్య కార్మికులను గుర్తించి వేదికపై వారిని ఘనంగా సన్మానించారు. పారిశుధ్య కార్మికులను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి గౌరవించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా కార్మికులకు ప్రభుత్వం, కూటమి నేతలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని నాయకులు హామీ ఇచ్చారు.